Breaking News

కొనసాగుతున్న సూక్ష్మ రుణ రంగం సంక్షోభం

Published on Fri, 04/04/2025 - 06:21

ముంబై: సూక్ష్మ రుణ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. డిసెంబర్‌ త్రైమాసికంలో రుణ వితరణ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 42 శాతం మేర తగ్గిపోయినట్టు క్రిఫ్‌ హైమార్క్‌ నివేదిక తెలిపింది. మొత్తం 1.19 కోట్ల రుణ దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు.. వీటి ద్వారా రూ.63,400 కోట్ల రుణాలు జారీ చేసినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రుణ వితరణ రూ.97,400 కోట్లుగా ఉంది. 

పేదలు, తక్కువ ఆదాయ వర్గాలు సూక్ష్మ రుణ ఖాతాదారులుగా ఉండడం గమనార్హం. 31–180 రోజుల వరకు చెల్లింపుల్లేని రుణాలు (మొండి బాకీలు) మొత్తం రుణాల్లో 6.4 శాతానికి పెరిగాయి. 2023 డిసెంబర్‌ చివరికి ఇవి 2 శాతంగానే ఉన్నాయి. ఈ ప్రకారం సూక్ష్మ రుణ రంగంలో తీవ్ర ఒత్తిళ్లు నెలకొన్నట్టు తెలుస్తోంది. 

సూక్ష్మ రుణ సంస్థల నిర్వహణలోని మొత్తం రుణ ఆస్తులు 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 4 శాతం మేర, 2024 సెపె్టంబర్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే 5.4 శాతం క్షీణించి రూ.3.91 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

ఒక్కో వ్యక్తికి గరిష్టంగా కొన్ని సంస్థల పరిధిలోనే రుణాల మంజూరు పరిమితులు ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. యాక్టివ్‌ రుణాలు (లావాదేవీలు కలిగిన) డిసెంబర్‌ చివరికి 14.6 కోట్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇవి 15.7 కోట్లుగా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 15.8 శాతం, రాజస్థాన్‌లో 11.6 శాతం, ఒడిశాలో 9 శాతం, తమిళనాడులో 8.3 శాతం చొప్పున సూక్ష్మ రుణ వితరణ తగ్గింది. యూపీలో మాత్రం 1.2 శాతం వృద్ధి నమోదైంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)