Breaking News

అమ్మకాల్లో తగ్గేదేలే.. మార్కెట్లో విండ్సర్ హవా!

Published on Mon, 02/10/2025 - 21:30

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఎంజీ మోటార్' (MG Motor) కొత్త 'విండ్సర్' (Windsor) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2024 అక్టోబర్ నుంచి 3000 యూనిట్లకు తగ్గకుండా కంపెనీ విండ్సర్ కార్లను విక్రయిస్తోంది.

ఎంజీ మోటార్ ఇండియా.. జనవరి 2025లో 3,277 యూనిట్ల విండ్సర్‌లను విక్రయించింది. డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లు, అక్టోబర్ 2024లో 3,116 యూనిట్ల అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.99 లక్షలు, రూ. 14.99 లక్షలు, రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఎంజీ విండ్సర్ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేస్తే.. ధరలు చాలా తగ్గుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 38kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో కూడిన మాగ్నెట్ సింక్రోనస్ మోటారును పొందుతుంది. ఒక ఫుల్ ఛార్జిపై ఇది 332 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఎంజీ విండ్సర్ ప్రకాశవంతమైన లోగో, ఎల్ఈడీ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంగతి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)