ఐటీలో లేఆఫ్స్‌ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!

Published on Wed, 10/04/2023 - 10:17

Meta Layoffs: ఐటీ రంగంలో లేఆఫ్స్‌ పర్వానికి ఇంకా తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థలు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాలో మరోసారి ఉద్యోగాల కోత వార్త కలకలం రేపుతోంది. త్వరలోనే మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విడత తొలగింపుల్లో కంపెనీలోని చిప్ డెవలప్‌మెంట్ టీమ్‌పై ప్రభావం చూపుతుంది.

గత నవంబర్ నుండి 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన Meta, ఈసారి తన Metaverse డివిజన్ నుండి  ఎంప్లాయిస్‌పై వేటు వేయనుంది. దీంతో ఆగ్మెంటెడ్ , వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల  సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేయవచ్చు. 

రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ టీంలో ఉద్యోగులను సాగనంపాలని భావిస్తోంది. కంపెనీ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాధిత ఉద్యోగులకు సమాచారం అందిందనీ, దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపుల  ప్రక్రియ  బుధవారం ఉంటుందని  భావిస్తున్నారు. అయితే  తొలగింపులపై మెటా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.  

కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని మరొక చిప్-మేకింగ్ యూనిట్  కష్టాల్లో పడింది. ఆ ప్రయత్నాలకు బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్ ఇటీవల  రాజీనామా చేశారు.  కాగా Meta ప్రస్తుతం క్వెస్ట్ వంటి మిశ్రమ రియాలిటీ హెడ్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరాలు AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు మరియు ధరించిన వారితో కమ్యూనికేట్ చేయగలవని కంపెనీ తెలిపింది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన AR గ్లాసెస్, స్మార్ట్‌వాచ్‌లపై  కూడా పని చేస్తోంది.

కాగా గ్లోబల్‌ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆదాయాల క్షీణత నేపథ్యంలో ఐటీ సహా చాలాకంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ లాంటి దిగ్గజాలు వేలాది ఉద్యోగులను  తొలగించిన సంగతి తెలిసిందే.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)