Breaking News

సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది

Published on Thu, 09/05/2024 - 14:23

మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్‌ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)