Breaking News

మెర్సిడెస్‌ నుంచి రూ.3.80 కోట్ల ‘ఆఫ్‌రోడ్‌’ జీ-వాగన్‌..

Published on Wed, 09/23/2026 - 21:39

లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌ భారత్‌లో తొలిసారిగా ఏఎంజీ జీ 63 ‘ఆఫ్‌రోడ్‌ ప్రో’ ప్రత్యేక వాహనాన్ని ప్రవేశపెట్టింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ వాహనం ధర రూ.3.80 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. కఠినమైన భూభాగాల్లో ప్రయాణించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. ప్రత్యేకమైన సస్పెన్షన్‌ వ్యవస్థ, మెరుగైన వీల్‌ గ్రిప్‌, వాహన స్థిరత్వాన్ని పెంచే సాంకేతికతలు ఇందులో ఉన్నాయి. కొత్త ఆఫ్‌రోడ్‌ నియంత్రణ వ్యవస్థ ద్వారా క్లిష్టమైన మార్గాల్లో వాహనాన్ని సులభంగా నడపవచ్చు.

ఈ వాహనంలో 4.0 లీటర్ల సామర్థ్యం కలిగిన ఎనిమిది సిలిండర్ల బై-టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. 48 వోల్ట్‌ల స్వల్ప విద్యుత్‌ సహాయక వ్యవస్థతో కలిపి ఇది 585 హెచ్‌పీ పవర్‌, 850 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు చక్రాలకు శక్తిని అందించే వ్యవస్థను ఇందులో ఇచ్చారు. ఇరవై అంగుళాల ప్రత్యేక చక్రాలు, పైకప్పుపై సామాను ఉంచేందుకు ప్రత్యేక అమరిక, వెనుక మెట్లను కూడా అందించారు. 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో అందుకోగలదు.

ఇంటీరియర్‌లో నప్పా లెదర్‌, ప్రీమియం మెటీరియల్స్‌, కస్టమైజ్‌ చేసుకునే యాంబియంట్‌ లైటింగ్‌ ఉన్నాయి. కొత్త ఆఫ్‌రోడ్‌ కాక్‌పిట్‌ ద్వారా వాహనం స్థానం, కంపాస్‌, ఎత్తు, స్టీరింగ్‌ యాంగిల్‌, టైర్‌ ప్రెజర్‌, డిఫరెన్షియల్‌ లాక్‌ వంటి సమాచారాన్ని డ్రైవర్‌ సులభంగా చూడవచ్చు. MBUX NTG7 ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు ఆగ్మెంటెడ్‌ రియాలిటీ నావిగేషన్‌ కూడా లభిస్తుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)