Breaking News

మెహుల్‌ చోక్సీకి క్యాన్సర్‌ చికిత్స

Published on Wed, 02/12/2025 - 17:03

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ.13,500 కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇటీవల ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయత్నిస్తోంది. దాంతో ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.

చోక్సీ తన బంధువు నీరవ్ మోదీతో కలిసి మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్ఎల్‌సీ) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో రూ.13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి కొనసాగుతున్న ఈ కేసు తదుపరి విచారణను ముంబయి కోర్టు ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. చోక్సీ ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రయాణం చేయలేకపోతున్నాడని, ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడం అన్యాయమని తన తరఫు న్యాయవాది వాదించారు. ఈ కుంభకోణం బయటపడకముందే భారత్‌ను వదిలి వెళ్లిన ఆయన 2018 నుంచి ఆంటిగ్వాలోనే ఉంటున్నారని చెప్పారు. మరోవైపు నీరవ్ మోదీని 2019లో ఎఫ్ఈఓగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు.

ఇదీ చదవండి: భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులు

చోక్సీ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాబోయే విచారణలో ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫ్‌ఈఓగా ప్రకటిస్తే తన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి నష్టాన్ని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెహుల్‌ చోక్సీ ఈక్విటీ ఆస్తులకు సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ హోల్డింగ్‌లను జప్తు చేసింది.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)