Breaking News

బెల్జియంకు పారిపోయిన వజ్రాల వ్యాపారి: రప్పించే యత్నంలో భారత్

Published on Sun, 03/23/2025 - 09:34

పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ. 13వేల కోట్లు మోసం చేసి భారతదేశాన్ని విడిచిపెట్టి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి 'మెహుల్ చోక్సీ'ను రప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం.. బెల్జియంలోని సంబంధిత అధికారులను సంప్రదించింది.

వేలకోట్లు మోసం చేసి.. ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్న మెహుల్ చోక్సీ.. ఈ మధ్య కాలంలోనే బెల్జియం వెళ్ళాడు. తన భార్య ప్రీతి బెల్జియన్ పౌరురాలు అని తెలుస్తోంది. దీంతో చోక్సీ కూడా అక్కడ రెసిడెన్సీ కార్డ్ పొందాడు. బెల్జియన్ నివాసం కోసం తప్పుడు పత్రాలు ఉపయోగించారని చోక్సీపై ఆరోపణలు ఉన్నాయి.

నిజానికి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. చోక్సి, నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్‌ మోదీ బ్రిటన్‌ జైలులో ఉన్నాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్‌ గ్రీన్‌ మాట్లాడుతూ.. మెహుల్‌ ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం చోక్సి విదేశాల్లో ఉన్నప్పటికీ.. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోలేదు.

ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి

ఇక లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వడంపై కోర్టులు పదే పదే నిరాకరించడంతో.. తనను భారతదేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు. మెహుల్‌ ఛోక్సీని బెల్జియం అధికారులు.. భారత ప్రభుత్వానికి అప్పగిస్తారా?.. లేదా?, అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)