మీషో యూజర్లు 17.5 కోట్లు

Published on Sun, 12/15/2024 - 05:49

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ సంస్థ ‘మీషో’ ఈ ఏడాది ఆర్డర్లలో 35 శాతం వృద్ధిని సాధించినట్టు ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులు (యూజర్లు) 25 శాతం పెరిగి 17.5 కోట్లకు చేరినట్టు తెలిపింది. వినియోగం పుంజుకోవడం, టైర్‌–2 నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ–కామర్స్‌ సేవలను వినియోగించుకునే వారు పెరగడం సౌందర్య, వ్యక్తిగత రక్షణ (బీపీసీ), హోమ్, కిచెన్‌ విభాగాల్లో వార్షికంగా ఆర్డర్లు 70 శాతం పెరగడం వృద్ధికి సాయపడినట్టు పేర్కొంది.

 ‘‘మొత్తం ఆర్డర్లు వార్షికంగా 35 శాతం పెరగడం అన్నది బలమైన వినియోగ సెంటిమెంట్‌కు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఈ–కామర్స్‌ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. పెడుతున్న వ్యయానికి తగిన విలువ కోరుకునే కస్టమర్లతో ఈ వృద్ధి సాధ్యమవుతోంది. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్‌ కేర్, గృహోపకరణాల్లో అందుబాటు ధరల్లో ఉత్పత్తులను వారు కోరుకుంటున్నారు’’అని మీషో తన ప్రకటనలో వివరించింది. 

ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ వృద్ధి పథాన్ని కొనసాగించామని, లావాదేవీలు నిర్వహించే యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 17.5 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. 2023 చివరికి సంస్థ యూజర్లు 14 కోట్లుగా ఉన్నారు. నాయుడుపేట (ఆంధ్రప్రదేశ్‌), షేర్గటి (బీహార్‌), హర్పణహల్లి (కర్ణాటక) తదితర టైర్‌–4, అంతకంటే చిన్న పట్టణాల నుంచే సగం యూజర్లు ఉన్నట్టు మీషో తెలిపింది. 21 కోట్ల డౌన్‌లోడ్‌లతో వరుసగా నాలుగో ఏడాది ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న షాపింగ్‌ యాప్‌గా తమ స్థానాన్ని కాపాడుకున్నట్టు పేర్కొంది.  

ఒక వంతు జెన్‌ జెడ్‌ నుంచే.. 
తమ మొత్తం యూజర్లలో మూడింత ఒక వంతు మంది జెనరేషన్‌ జెడ్‌ (1996–2009 మధ్య జన్మించిన వారు) వారేనని మీషో తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.7,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. ప్రస్తుత యూజర్ల నుంచి ఆర్డర్లకుతోడు, యాక్టివ్‌ యూజర్ల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.232 కోట్ల ఆపరేటింగ్‌ క్యాష్‌ఫ్లో సాధించిన మొదటి ఈ–కామర్స్‌ సంస్థ మీషో అని తెలిపింది. మీషో మాల్‌పై ప్రముఖ బ్రాండ్లు అయిన లోటస్‌ ఆరు రెట్లు, జోయ్‌ 5.5 రెట్లు, రెనీ 3.5 రెట్లు, డాలర్‌ 1.8 రెట్లు చొప్పున వృద్ధి సాధించినట్టు పేర్కొంది. 2024లో 2.2 కోట్ల మోసపూరిత లావాదేవీలను నివారించినట్టు మీషో తెలిపింది. 77 లక్షల స్కామ్‌ దాడులను అడ్డుకున్నట్టు వివరించింది. శాంతి భద్రతల ఏజెన్సీల సహకారంతో మోసాలను నివారించడంలో 98 శాతం మేర విజియం సాధించినట్టు తెలిపింది.   

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)