మీషోపై పడ్డ సైబర్ నేరగాళ్లు: ఎన్ని కోట్లు దోచేశారంటే..

Published on Tue, 12/03/2024 - 18:57

సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే మోసం చేశారని గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీషో కంపెనీని మోసం చేసి ఏకంగా రూ. 5.5 కోట్లు నష్టాన్ని కలిగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సైబర్ నేరగాళ్లు మీషో ఈ-కామర్స్ కంపెనీలో ఫేక్ సెల్లర్‌గా నటిస్తూ.. అదే ప్లాట్‌ఫామ్‌లో నకిలీ ఖాతాల ద్వారా ఆర్డర్లు చేసేవారు. ఆర్డర్ డెలివరీ చేసుకున్న తరువాత వాటి స్థానంలో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత వస్తువులను పెట్టి మళ్ళీ రిటర్న్ చేసేవారు. దీనిని నిజమని నమ్మించడానికి వీడియోలు కూడా క్రియేట్ చేసేవారు. ఆ తరువాత డబ్బు వెనక్కి తీసుకునేవారు.

మోసగాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య ఇదే వరుసలో మోసాలు చేస్తూ.. మీషో  నుంచి రూ. 5.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు జమచేసుకోవడానికి వీరు వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. ఈ మోసాన్ని కంపెనీ గుర్తించిన తరువాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీషో కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)