Breaking News

భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..

Published on Sat, 06/01/2024 - 11:48

ఎలక్ట్రానిక్‌ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్‌3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్‌ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్‌3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్‌ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్‌లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్‌3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్‌బుక్‌

ఫేమ్‌3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథ​కంలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌(ఎన్‌ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్‌ ఇండియా1ను 2015, ఏప్రిల్‌1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్‌2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్‌3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)