Breaking News

ఐపీవో బాటలో మెడికవర్‌ 

Published on Tue, 09/16/2025 - 06:04

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెల్త్‌కేర్‌ సేవల దిగ్గజం మెడికవర్‌ వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుత రుణభారం సుమారు రూ.1,000 కోట్లుగా ఉంది. సంస్థ సీఎండీ అనిల్‌ కృష్ణ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. కొత్తగా రెండు ఆస్పత్రులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. 

గ్రూప్‌లో 24వదైన సికింద్రాబాద్‌ హాస్పిటల్‌ను మంగళవారం (నేడు) ప్రారంభించనుండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో మరొకటి (500 బెడ్స్‌ సామర్థ్యం) అందుబాటులోకి వస్తుందని కృష్ణ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం సుమారు రూ. 1,850 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇక కొత్త ఆస్పత్రితో కలిపి నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) పడకల సామర్థ్యం 5,800గా ఉంటుందని కృష్ణ చెప్పారు. హైదరాబాద్‌ చందానగర్‌లో 150 పడకల విస్తరణతో మొత్తం బెడ్స్‌ సంఖ్య 6,400కి చేరుతుందన్నారు. ఐపీవోకి సంబంధించి వంద కోట్ల డాలర్ల దాకా వేల్యుయేషన్‌ అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు.  


చిన్న పట్టణాలపై మరింత ఫోకస్‌ ... 
ప్రస్తుతం తమకు కార్యకలాపాలున్న ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కృష్ణ తెలి పారు. బెంగళూరు, పుణేల్లాంటి నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించారు. అవకాశం వస్తే 300 –350 బెడ్స్‌ సామర్థ్యాలు ఉండే ఇతర ఆస్పత్రుల కొనుగోలు అంశాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. సాధా రణంగా లీజు ప్రాతిపదికన ప్రాంగణాలను తీసుకుంటున్న తాము ఇకపై తమ కార్యకలాపాల కోసం పూర్తి స్థాయిలో ప్రాపర్టీని కొనుగోలు చేయడంపై ఫోకస్‌ పెట్టనున్నట్లు వివరించారు. వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రతిభావంతులైన వైద్యుల కొరత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అధునాతన టెక్నాలజీ గల పరికరాల దిగుమతి వ్యయాలు పెరిగిపోవడమనేది, చికిత్స వ్యయాల పెరుగుదలకు దారితీస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన, కచి్చతమైన చికిత్సను అందించడంలో కృత్రిమ మేథ (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని కృష్ణ చెప్పారు.  
 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)