Breaking News

కారు చౌక ఈవీ బేరం!

Published on Wed, 03/26/2025 - 01:17

ఎలక్ట్రిక్‌ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ల ‘మార్చ్‌’ నడుస్తోంది. ఈవీలకు డిమాండ్‌ తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నిల్వలను తగ్గించుకోవడానికి ఆటోమొబైల్‌ కంపెనీలు ఆఫర్ల జోరు పెంచాయి. ఎలక్ట్రిక్‌తో పాటు హైబ్రిడ్‌ వాహనాలపై కూడా కనిష్టంగా రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు  చెబుతున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి రేట్ల పెంపు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాహన కంపెనీలు ఈవీలపై భారీ డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. గడిచిన కొన్ని వారాల్లో విడుదల చేసిన కొన్ని కొత్త మోడల్స్‌ మినహా దాదాపు అన్ని ఎలక్ట్రిక్‌ కార్లపై కనీసం రూ.1 లక్ష తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నాయి. ఇందులో 2025 మోడల్స్‌తో పాటు 2024లో తయారైనవి కూడా ఉన్నాయి. కాగా, ఈ డిస్కౌంట్లలో క్యాష్‌ తగ్గింపు, స్క్రాపేజీ, ఎక్సే్ఛంజ్‌ బోనస్‌లు, ఉచిత యాక్సెసరీలు, అలాగే అదనపు వారంటీ వంటివన్నీ కలిసి ఉంటాయి. సాధారణంగా అమ్మకాలు మందకొడిగా ఉండే సంవత్సరాంతం (డిసెంబర్‌ నెల)లో వాహన సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం ఈవీలపై ఇస్తున్న తగ్గింపు అప్పటితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. దీనికి ప్రధానంగా డిమాండ్‌ తగ్గడమే కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

కియా.. బంపర్‌ ఆఫర్‌ 
దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా మోటార్స్‌ తన ఈవీ6 2025 వేరియంట్‌పై ఏకంగా రూ.15 లక్షల భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీని రేంజ్‌ 650 కిలోమీటర్లు. అంతక్రితం రూ. 77 లక్షలుగా ఉన్న ఈవీ6 ఆన్‌రోడ్‌ ధర ఇప్పుడు రూ.62 లక్షలకు దిగొచి్చంది. ఇక హ్యుందాయ్‌ కూడా ఐయానిక్‌5 మోడల్‌పై రూ. 4 లక్షల తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది. డిసెంబర్లో దీనిపై రూ.2 లక్షల డిస్కౌంట్‌ మాత్రమే కంపెనీ అందించింది. అయితే, జనవరిలో విడుదల చేసిన క్రెటా ఈవీపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్‌ ఇవ్వడం లేదు. ఈవీ మార్కెట్లో అత్యధిక వాటాతో దూసుకెళ్తున్న టాటా మోటార్స్‌ పలు మోడల్స్‌పై రూ. 1.86 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల ప్రవేశపెట్టిన కర్వ్‌ ఈవీపై గరిష్టంగా రూ.1.71 లక్షల తగ్గింపు లభిస్తోంది. నెక్సాన్‌ ఈవీపై రూ.1.41 లక్షలు , టియాగో ఈవీపై రూ.1.31 లక్షలు చొప్పున డిస్కౌంట్‌ ఇస్తోంది. 

హైబ్రిడ్‌లపైనా... 
మహీంద్రాతో పాటు కొన్ని కంపెనీలు ఈ ఏడాది కొత్త ఈవీలను తీసుకురావడంతో పాత మోడల్స్‌ పట్ల ఆసక్తి తగ్గిందని.. దీనికి తోడు అధిక ధరల ప్రభావం వల్ల కూడా డిమాండ్‌ తగ్గుముఖం పట్టిందని ప్రముఖ కార్ల కంపెనీకి చెందిన ఓ డీలర్‌ అభిప్రాయపడ్డారు. కాగా, ఈవీలతో పాటు హైబ్రిడ్‌ మోడల్స్‌ కూడా కారు చౌకగా దొరుకుతున్నాయి. మారుతీ సుజుకీ హైబ్రిడ్‌ కార్లు గ్రాండ్‌ విటారాపై రూ.1.35 లక్షలు, ఇని్వక్టోపై రూ.1.4 లక్షల చొప్పున ఆఫర్‌ నడుస్తోంది. అలాగే హోండా సిటీ ఈ–హెచ్‌ఈవీ దాదాపు రూ.1 లక్ష తక్కువకే దొరుకుతోంది.    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

కొత్త మోడల్స్‌ దన్ను...
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఈవీ కార్ల సేల్స్‌ 20,234 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 26 శాతం పెరిగినట్లు వాహన డీలర్ల అసోసియేషన్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) పేర్కొంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలకు కొత్త మోడల్స్‌ దన్నుగా నిలుస్తున్నాయి. ఇందులో ఎంజీ విండ్సర్‌ వంటి మోడల్స్‌ అమ్మకాలు కీలకంగా నిలుస్తుండటమే కారణం. 2024లో 20 శాతం వృద్ధితో 99,165 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. కాగా, మార్కెట్‌ లీడర్‌ టాటా మోటార్స్‌ (43 శాతం వాటా) ఈవీ సేల్స్‌ ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 19 శాతం మేర పడిపోవడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)