Breaking News

మారుతీ వ్యాగన్‌ఆర్‌లో తిరిగే సీటు!

Published on Thu, 12/18/2025 - 10:41

సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు వాహనంలోకి సులువుగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా తమ వ్యాగన్‌ఆర్‌ కారులో స్వివల్‌ సీట్‌ ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది.

రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు.  వ్యాగన్‌ఆర్‌ స్వివల్‌ సీటు .. ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (ఏఆర్‌ఏఐ) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. అసమానతలను తొలగించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పర్యావరణహిత అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఇది ముందడుగని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 11 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 200కు పైగా మారుతీ సుజుకి అరేనా డీలర్‌షిప్‌లలో ఈ స్వివల్‌ సీటు ఏర్పాటు సదుపాయాన్ని  అందుబాటులోకి తెచ్చింది. కొత్త వ్యాగన్‌ఆర్‌ కార్లకు అలాగే ఇప్పటికే ఉన్న కార్లకు కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్, 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ సుజుకి, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్‌- ఐఐఎం బెంగళూరు స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద బెంగళూరుకు చెందిన ట్రూఅసిస్ట్‌ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు వ్యాగన్‌ఆర్ స్వివెల్ సీట్‌ను రెట్రోఫిట్ కిట్‌గా అరేనా డీలర్‌షిప్‌లలో ఆర్డర్ చేయవచ్చు. వాహనం నిర్మాణం లేదా ప్రాథమిక పనితీరులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సీటును అమర్చుతారు.

టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్‌ఆర్.. విశాలమైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌తో ఈ ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్‌కు అత్యంత అనుకూలంగా నిలుస్తుంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకీ మోడళ్లలో వ్యాగన్‌ఆర్ ఒకటి.

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)