Breaking News

మారుతి సుజుకి చిన్న కార్ల ధరలు తగ్గింపు

Published on Mon, 09/02/2024 - 18:49

మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్‌-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్‌ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్‌లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్‌-ప్రెస్సో ఎల్‌ఎక్స్‌ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్‌పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్‌ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.

మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో ఎక్స్‌షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.

తగ్గిన విక్రయాలు
ఈ ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.

ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్‌లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్‌లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)