Breaking News

ఎక్కువమంది ఆ బ్రాండ్ కార్లనే కొనేస్తున్నారు

Published on Sun, 03/02/2025 - 13:03

ముంబై: వాహన కంపెనీల విక్రయాలు ఎగుమతులతో కలుపుకుని ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ప్యాసింజర్స్‌ వెహికిల్స్‌ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. డిమాండ్‌ స్తబ్ధుగా ఉండడంతో హ్యుందాయ్, టాటా మోటార్స్‌ వాహన అమ్మకాలు నెమ్మదించాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లకు గిరాకీ లభించడంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వాహన విక్రయాలు గత నెలలో రెండంకెల వృద్ధి సాధించాయి.

మారుతీ సుజుకీ దేశీయంగా గత నెలలో 1,60,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,60,271 యూనిట్లు. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్‌ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వేగన్‌–ఆర్‌ అమ్మకాలు 71,627 నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజ్జా, గ్రాండ్‌ విటారా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 విక్రయాలు 61,234 నుంచి 65,033 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఫిబ్రవరిలో కంపెనీ 1,99,400 యూనిట్ల వాహనాలు విక్రయించింది.

➤హ్యుండై మోటార్‌ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 3% క్షీణించి 58,727 యూనిట్లకు వచ్చి చేరాయి. దేశీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్‌ 2025లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన ద్రవ్య లభ్యత మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం’ అని కంపెనీ సీఈవో తరుణ్‌ గర్గ్‌ అన్నారు.

➤టాటా మోటార్స్‌ మొత్తం వాహన విక్రయాలు 8% తగ్గి 77,232 యూనిట్లకు పరిమితమయ్యాయి.

➤ఎస్‌యూవీలకు డిమాండ్‌ లభించడంతో ఎంఅండ్‌ఎం మొత్తం అమ్మకాల్లో 15% వృద్ధి నమోదై 83,072 యూనిట్లకు చేరుకున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)