Breaking News

ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్‌ చేసిన ప్రముఖ కంపెనీ

Published on Sat, 03/23/2024 - 08:57

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కంపెనీకు చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ‍ప్రకటించింది. వాహనతయారీ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కృషిచేస్తాయి. కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరిగి వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ఇంధన పంప్‌ మోటార్‌లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగన్‌ఆర్‌ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్‌) మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. 

2019 జులై 30 నుంచి నవంబరు 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్‌ఆర్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంప్‌ మోటార్‌ భాగంలో లోపం ఉంటే, అరుదుగా ఇంజిన్‌ నిలిచిపోవడం లేదా స్టార్టింగ్‌ సమస్య తలెత్తవచ్చని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ అధీకృత డీలర్‌ వర్క్‌షాప్‌ల నుంచి ప్రభావిత వాహన యాజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు ఉండే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో కంపెనీ కార్లను రీకాల్‌ చేయలేదని తెలిసింది. 

మారుతీ సుజుకీ కంపెనీ ఇటీవల ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంన్‌క్స్‌ మోడళ్లను లాంచ్‌ చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన అరెనా, నెక్సా, ట్రూవాల్యూ మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి మొదటివారం వరకు కంపెనీ 43.82 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటల్‌ను కలిగి ఉంది. 2020లో అది 31.59 బిలియన్‌ డాలర్లుగా ఉండేది.

ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ వీసా నమోదు గడువు పొడగింపు

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)