Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే..

Published on Sat, 11/02/2024 - 13:47

భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉన్న 'మారుతి సుజుకి' ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ టయోటాతో కలిసి 'ఈవీఎక్స్' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.

టయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతి సుజుకి ఇండియా రెండూ కలిసి మొదటి ఎలక్ట్రిక్ కారును 2025లో ఈవీఎక్స్ కారును లాంచ్ చేయనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును గుజరాత్‌లోని తయారీ కర్మాగారంలో ఉత్పత్తి చేయనుంది.

మారుతి సుజుకి తయారీ కర్మాగారం.. గుజరాత్ హన్సల్‌పూర్‌లో ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ప్రస్తుతం ఇక్కడ బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్ వంటి మోడల్‌లు తయారవుతున్నాయి. ఈ కార్లను సంస్థ దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

మారుతి సుజుకి లాంచ్ చేయనున్న కొత్త ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ నుంచి 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈవీఎక్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందనున్నట్లు సమాచారం. లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)