ఈవీ విడిభాగాల తయారీ ఇక ఇక్కడే: మారుతి సుజుకీ

Published on Wed, 12/17/2025 - 12:49

మారుతి సుజుకీ ఎలక్ట్రిక్‌ కార్ల దిశగా బలమైన ప్రణాళికలతో ఉంది. ఎలక్ట్రిక్‌ కార్ల కోసం కీలకమైన విడిభాగాలను రానున్న సంవత్సరాల్లో ఇక్కడే తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ తెలిపారు. భారత్‌లో ఈవీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు.

ప్రస్తుతం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండగా, వీటిని సైతం ఇక్కడే తయారు చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్‌ వాహనం ఇ–విటారాను విడుదల చేయనున్న మారుతి సుజుకీ.. కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా స్థానికంగానే ఈవీ తయారీ ఎకోసిస్టమ్‌పై దృష్టి సారించినట్టు చెప్పారు. ఇంటి కోసం ప్రాథమిక వాహనంగా ఎలక్ట్రిక్‌ కారును వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేసినప్పుడే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తరణ వేగాన్ని అందుకుంటుందన్న అభిప్రాయాన్ని బెనర్జీ వ్యక్తం చేశారు.

‘‘ఈవీల విషయంలో కస్టమర్లు నమ్మకంగా లేరు. ఆరంభంలో వచ్చిన ఉత్పత్తులకు సంబంధించిన అనుభవంతో, ప్రయాణ దూరం పరంగా వారి మనసుల్లో ప్రతికూల ధోరణి ఏర్పడింది. తగిన ప్రజా మౌలిక సదుపాయాలు లేవు. విక్రయానంతర సేవలు, రీసేల్‌ (తిరిగి విక్రయించే) విలువ ఈవీల వినియోగానికి ఉన్న పెద్ద సవాళ్లు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసిన వారు, వాటిని సెకండరీ వాహనంగానే వినియోగిస్తున్నారు’’అని వివరించారు. కనుక వినియోగదారుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై నమ్మకం కల్పించకపోతే వారు కొనుగోళ్లకు ముందుకురారని అభిప్రాయపడ్డారు.  

ఐదు మోడళ్లు: 2030 మార్చి నాటికి ఐదు ఈవీ మోడళ్లను కలిగి ఉండాలన్నది మారుతి సుజుకీ ప్రణాళికగా బెనర్జీ పేర్కొన్నారు. అప్పటికి ఎలక్ట్రిక్‌ కార్ల పరిమాణం 55–60 లక్షలుగా ఉండొచ్చని, ఈవీ విస్తరణ 13–15 శాతానికి చేరుకోవచ్చని చెప్పారు. మారుతి సుజుకీకి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లోని 1,500 వర్క్‌షాపులు ఎలక్ట్రిక్‌ వాహన సర్వీసులకు అనుకూలంగా ఉన్నట్టు, ఇప్పటికే 2,000 చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.    

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)