Breaking News

సాఫ్ట్‌వేర్‌ స్టార్టప్‌లో వాటా కొన్న మారుతీ

Published on Sat, 11/22/2025 - 09:22

టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌ రావిటీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 7.84 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు మారుతీ సుజుకీ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా రూ. 2 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. రావిటీ కనెక్టెడ్‌ మొబిలిటీ ఇన్‌సైట్స్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు పేర్కొంది.

ఈ ఫండ్‌ ద్వారా మారుతీ ఇంతక్రితం రెండుసార్లు దాదాపు రూ. 2 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. 2024 మార్చిలో  ఏఎంఎల్‌గో ల్యాబ్స్‌లో, 2022 జూన్‌లో సోషియోగ్రాఫ్‌ సొల్యూషన్స్‌లోనూ వాటా కొనుగోలు చేసింది. అత్యున్నతస్థాయి ఆవిష్కరణలకు తెరతీస్తున్న స్టార్టప్‌లలో ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు మారుతీ తెలియజేసింది.

కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన స్టార్టప్‌లవైపు దృష్టి పెడుతున్నట్లు తెలియజేసింది. కాగా.. మారుతీ పెట్టుబడుల నేపథ్యంలో ఏఐ, అనలిటిక్స్, మొబిలిటీలో కంపెనీకున్న సామర్థ్యం, నైపుణ్యాలను మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నట్లు రావిటీ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ రుంగ్తా పేర్కొన్నారు.

కాగా మారుతీ సుజుకీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 15,980 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 16,150ను తాకింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)