Breaking News

భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవా

Published on Wed, 08/28/2024 - 08:31

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో చిన్న కార్లకు డిమాండ్‌ పుంజుకుంటుందని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా  స్పష్టం చేసింది. భారత ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తక్కువ ధరకు లభించే చిన్న కార్లు అవసరమని విశ్వసిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు.

కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘చిన్న కార్ల డిమాండ్‌లో తాత్కాలికంగా ప్రస్తుతం డిమాండ్‌ తగ్గింది. అయితే ఇది కంపెనీ వ్యూహాన్ని మార్చబోదు. స్కూటర్‌ వాడుతున్న వారు దేశంలో భారీ సంఖ్యలో ఉన్నారు. సమీప భవిష్యత్తులో వీరు కార్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను వారు కోరుకుంటున్నారు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండే చిన్న కార్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. భారత్‌లో పెద్ద, విలాసవంత వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విక్రయాలు, సేవా నెట్‌వర్క్‌ను కంపెనీ మరింత బలోపేతం చేస్తోంది’ అని తెలిపారు.

ఆరు ఈవీ మోడళ్లు..

కంపెనీ నుంచి ఆరు ఎలక్ట్రిక్‌ మోడళ్లు 2030–31 నాటికి భారత్‌లో రంగ ప్రవేశం చేస్తాయని భార్గవ వెల్లడించారు. ‘కొన్ని నెలల్లోనే భారత్‌లో మారుతీ సుజుకీ తొలి ఈవీ రానుంది. ఈ కార్లను యూరప్, జపాన్‌కు ఎగుమతి చేస్తాం. 2030–31 నాటికి 40 లక్షల యూనిట్లకు తయారీ సామర్థ్యం పెంచుకుంటాం. 7.5–8 లక్షల యూనిట్లు ఎగుమతి చేస్తాం. 2024–25లో 3 లక్షల యూనిట్లు ఎగుమతులు జరగొచ్చు. హరియాణాలో 10 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రూ.18,000 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంటులో 2025–26లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)