CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
Published on Tue, 07/21/2026 - 20:26
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను మరోమారు పెంచడానికి సిద్ధమైంది. 2026 ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి దాని లైనప్లోని అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచనుంది. అయితే ఏ మోడల్ ధరను ఎంత వరకు పెంచనుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా కంపెనీ మూడు నెలలు ముందు కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు పెంచడం వల్ల అమ్మకాలు పెరుగుతాయా?, తగ్గుతాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో.. పెరిగిన ద్రవ్యోల్బణ భారాలు, ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు నుంచి కొత్త కారు కొనాలంటే.. ఇంకొంత ఖర్చు చేయక తప్పదని స్పష్టమవుతోంది.
Tags : 1