Breaking News

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!

Published on Sun, 06/07/2026 - 21:36

హ్యుందాయ్ కంపెనీ తన కార్లపై ఆఫర్స్ ప్రకటించగా.. టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ తరుణంలో మారుతి సుజుకి.. ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు పేర్కొంది.

మారుతి సుజుకి విక్టోరిస్
ఎంపిక చేసిన విక్టోరిస్‌ వేరియంట్లపై రూ. 90,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌లకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో సహా అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి.

విక్టోరిస్ CNG వేరియంట్లు రూ. 80,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉండగా, పెట్రోల్ వేరియంట్లను రూ. 60,000 వరకు తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై కూడా ఈ నెలలో మారుతి సుజుకి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ.45000 తగ్గింపు.. మాన్యువల్, CNG వేరియంట్‌లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది చాన్నాళ్లుగా బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. దీని ధర ప్రస్తుతం రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

మారుతి బ్రెజ్జా, వ్యాగన్ ఆర్
మారుతి సుజుకి బ్రెజ్జాను కొనుగోలు చేయాలనుకునే వారు పెట్రోల్, CNG వేరియంట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ పథకాలు ఉన్నాయి. వ్యాగన్ ఆర్ కొనుగోలుపై రూ. 52,500 వరకు తగ్గింపులు కూడా లభిస్తున్నాయి.

ఆల్టో కే10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకో
వేరియంట్‌ను బట్టి మారుతి సుజుకి ఆల్టో కే10పై రూ. 52,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో.. సెలెరియో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఈకోలపై రూ. 37,500 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి డిజైర్, ఎర్టిగా మోడళ్లపై కంపెనీ ఈ నెలలో ఎలాంటి అధికారిక డిస్కౌంట్లు అందించడం లేదు. ఈ రెండు మోడళ్లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సంస్థ ఆఫర్స్ అందించకపోవడానికి కారణం కావచ్చని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఆఫర్లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్స్ అన్నీ జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)