Breaking News

రూ.6.10 లక్షలకే కొత్త బాలెనో.. ఫుల్ అప్‌డేట్స్‌తో లాంచ్!

Published on Sat, 09/05/2026 - 20:11

మారుతి సుజుకి ఎట్టకేలకు బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో.. రూ. 6.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా డిజైన్ మార్పులతో పాటు, ఫీచర్లు, భద్రత, పవర్‌ట్రెయిన్లలో కూడా ఎక్కువ అప్‌డేట్‌లను పొందింది.

మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ పాత మోడల్ మాదిరిగా.. అదే సిల్హౌట్‌ పొందుతుంది. అయితే.. డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల కోసం కొద్దిగా సవరించిన డిజైన్‌ను పొందుతుంది. ముందు భాగంలోని గ్రిల్‌కు కొత్త డిజైన్, అలాగే బంపర్‌కు కూడా సరికొత్త డిజైన్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మాత్రం అలాగే ఉంది, కానీ కొత్త అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.

2026 మారుతి సుజుకి బాలెనో క్యాబిన్ బ్లూ అండ్ బ్లాక్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ లేఅవుట్‌తో వస్తుంది. డాష్‌బోర్డ్ లేఅవుట్ పాత మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రాథమిక నియంత్రణల కోసం ఫిజికల్ బటన్లు ఉంటాయి. ఈ కారు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ కోసం అదే డిజైన్‌ను కొనసాగిస్తుంది.

కొత్త బాలెనోలో.. మొదటిసారిగా ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా.. ఈ బ్రాండ్ వైర్‌లెస్ ఛార్జర్, క్లారియన్ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో లభిస్తుంది. అంతేకాకుండా.. ఈ బ్రాండ్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన CNG వేరియంట్‌ను కూడా అందిస్తోంది. కాగా ఇది హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్

Videos

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)