Breaking News

మారుతీ ఎరీనా.. 70 లక్షల కస్టమర్లు

Published on Fri, 09/01/2023 - 04:31

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా రిటైల్‌ విభాగం అయిన ఎరీనా ఆరు వసంతాల ఉత్సవాలను జరుపుకుంటోంది. 2017 నుంచి ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కార్లు ఎరీనా ఔట్‌లెట్ల నుంచి రోడ్డెక్కాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,392 నగరాలు, పట్టణాల్లో 2,853 ఎరీనా విక్రయ శాలలు ఉన్నాయి. ఆల్టో కె–10, ఎస్‌–ప్రెస్సో, వేగన్‌–ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో మోడళ్లను ఈ స్టోర్లలో విక్రయిస్తున్నారు.

2022లో భారత్‌లో అమ్ముడైన టాప్‌–10 మోడళ్లలో ఆరు వీటిలో ఉండడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ మొత్తం అమ్మకాల్లో అరీనా వాటా 68 శాతం ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటా 10 లక్షల కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నట్టు తెలిపారు. ఎరీనా విక్రయశాలల్లో 32,130 మంది రిలేషన్‌íÙప్‌ మేనేజర్లు వినియోగదార్ల సేవల్లో నిమగ్నమయ్యారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)