Breaking News

మారుతి మరో సూపర్‌ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు

Published on Wed, 07/05/2023 - 16:52

దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి  చెందిన మోస్ట్‌ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే  ఫీచర్స్‌తో  మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్‌విక్టోను లాంచ్‌ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్‌విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ మోటార్‌తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను పొందిన తొలి మారుతీ కారు ఇన్‌విక్టో  అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. 

భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్‌విక్టో  ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్.  2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత  ఇది సెకండ్‌ ప్రొడక్షన్‌.

 Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే  మూడు వేరియంట్లలో   వీటి ధర రూ. 24.79 లక్షల  మొదలై టాప్ వేరియంట్  రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్‌ వేరియంట్ ధర  రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్‌తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్‌లో ఎనిమిదోది .

2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్‌ 172బిహెచ్‌పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్  ప్రీమియం ఫీచర్లతో  లాంచ్‌ అయింది.  హైక్రాస్‌తో పోలిస్తే, జేబీఎల్‌ సౌండ్ సిస్టమ్, సెకండ్‌ రో ఒట్టోమన్ సీట్లు తప్ప  దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్‌, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్‌ బాగ్స్‌, లెదర్ అప్‌హోల్స్టరీతో కూడా వస్తుంది. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)