Breaking News

ఆటో.. అటూ ఇటూ!

Published on Fri, 05/02/2025 - 00:46

ముంబై: మార్కెట్లో నెలకొన్న పలు ప్రతికూల సవాళ్ల మధ్య మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) కంపెనీల వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో పెరిగాయి. అయితే టాటా మోటార్స్, హ్యుందాయ్‌ మోటార్‌ విక్రయాలు తగ్గాయి. ఆసక్తికరంగా, గత నెలలో దేశీయ ప్యాసింజర్‌ వాహన విభాగంలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా, ధీర్ఘకాలం పాటు ద్వితీయ స్థానంలో కొనసాగిన హ్యుందాయ్‌ మోటార్స్‌ నాలుగో స్థానానికి దిగివచ్చింది.   

⇒ మారుతీ సుజుకీ దేశీయంగా ఏప్రిల్‌ నెలలో 1,38,074 ప్యాసింజర్‌ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్‌లో అమ్ముడైన 1,37,952 వాహనాలతో పోలిస్తే 1% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌–ప్రెస్సో విక్రయాలు 11,519 నుంచి 6,332 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్‌ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వేగన్‌–ఆర్‌ అమ్మకాలు 56,953 నుంచి 61,591 యూనిట్లకు పెరిగాయి.  ఎగుమతులు కలుపుకొని ఈ ఏప్రిల్‌లో కంపెనీ 1,79,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. 

⇒ మహీంద్రా అండ్‌ మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 28% వృద్ధి చెంది 41,000 యూనిట్ల నుంచి 52,330 యూనిట్లకు వచ్చి చేరాయి. మా పోర్ట్‌ఫోలియో బలాన్ని, కస్టమర్ల ప్రతిపాదనలను అమ్మకాల సంఖ్య తెలియజేస్తుందని కంపెనీ ఆటోమోటివ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ నక్రా తెలిపారు.  

⇒ టాటా మోటార్స్‌ దేశీయ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు(ఈవీలను కలుపుకొని) క్రితం ఏడాది ఇదే ఏప్రిల్‌తో పోలిస్తే 47,883 యూనిట్ల నుంచి 45,199 యూనిట్లకు దిగివచ్చాయి.  
⇒ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 12% క్షీణించి 44,374 యూనిట్లకు వచ్చి చేరాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 50,021 గా ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)