Breaking News

ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?

Published on Thu, 08/03/2023 - 15:09

Maruti Alto: మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తమ ఆల్టో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి  ప్రకటించింది.

ఆల్టో బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వివిధ మోడళ్లున్న సంగతి తెలిసిందే. గడచిన 23 ఏళ్లలో 45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిందని మారుతి పేర్కొంది. కీలకమైన మైలు రాయిని అధిగమించినందుకు సంతోషంగా ఉందన్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ  వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్టో  అద్భుతమైన ప్రయాణం చాలా గర్వంగా ఉంది. 45 లక్షల కస్టమర్ మైలురాయి అంటే ఇప్పటి వరకు ఏ ఇతర కార్ బ్రాండ్ సాధించలేని ఘనత అని అన్నారు. (టమాటా షాక్‌: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!)

దేశంలో  మారుతి ఆల్టో 2000 సంవత్సరంలో  లాంచ్‌  అయింది. 2010లో మారుతి ఆల్టో కె10, ఆల్టో సిఎన్‌జిలను విడుదల చేసింది. 2012 నాటికి  20 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది.  2012 సంవత్సరంలో ఆల్టో 800ని విడుదల చేసింది, ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండో తరం ఆల్టో కె10ని విడుదల చేసింది. 2016లోఆల్టో  30 లక్షల అమ్మకాల సంబరాలను జరుపుకుంది. 2020లో అమ్మకాలు 40 లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. గత  ఏడాది కంపెనీ మూడవ తరం ఆల్టో కె10ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం పెట్రోల్ , సీఎన్‌జీ  పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి)


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)