Breaking News

మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..

Published on Wed, 04/02/2025 - 08:40

స్వల్ప డిమాండ్, నిల్వల సర్దుబాటులో భాగంగా డీలర్లకు సరఫరా తగ్గడంతో మార్చిలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్స్‌ దేశీయ వాహన విక్రయాలు క్షీణించాయి. మరోవైపు ఎస్‌యూవీ మోడళ్లకు డిమాండ్‌ కొనసాగడంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది.

మారుతీ సుజుకీ దేశీయంగా క్రితం నెలలో 1,50,743 వాహనాలు విక్రయించింది. గత ఏడాది మార్చిలో అమ్ముడైన 1,52,718 వాహనాలతో పోలిస్తే 1% తక్కువ. కాగా ఆర్థిక సంవత్సరం 2024–25(ఎఫ్‌వై 25)లో దేశీయంగా మొత్తం 17,60,767 ప్యాసింజర్‌ వాహనాలు అమ్మింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 17,59,881 యూనిట్లుగా ఉంది.  

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీయ వాహన విక్రయాలు 53,001 యూనిట్ల నుంచి 2% క్షీణించి 51,820కు వచ్చి చేరాయి. ఇక ఎఫ్‌వై 25లో దేశీయంగా 5,98,666 వాహనాలు అమ్మింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 6,14,721 యూనిట్లుగా ఉంది.  

ఎస్‌యూవీలకు డిమాండ్‌ లభించడంతో ఎంఅండ్‌ఎం మార్చి దేశీయ అమ్మకాల్లో 18% వృద్ధి నమోదై 48,048 యూనిట్లకు చేరాయి. 
ఎఫ్‌వై25లో దేశీయంగా 5,51,487 ప్యాసింజర్‌ వాహనాలు విక్రయించింది. ఎఫ్‌వై 2024లో అమ్ముడైన 4,59,877 వాహనాలతో పోలిస్తే ఇవి 20% అధికం.

టాటా మోటార్స్‌ మొత్తం వాహన విక్రయాలు 3% పెరిగి 51,872 యూనిట్లకు చేరుకున్నాయి. ఎఫ్‌వై 25లో ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 3% క్షీణత నమోదై 5,56,263 యూనిట్లకు దిగివచ్చాయి.

ఇదీ చదవండి: లిస్టింగ్‌కు కంపెనీల క్యూ

ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ మార్చి నెలలో 23,430 వాహనాలను విక్రయించినట్లు వాహన్‌ డేటాలో వెల్లడైంది. గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల నుంచి మంచి డిమాండ్‌ కారణంగా విక్రయాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. తన జెన్‌3 వాహనాల డెలివరీలను మార్చి నుంచి ప్రారంభించింది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచి ఏప్రిల్‌ నుంచి వేగవంతమైన డెలివరీలు అందిచనున్నట్లు ఓలా తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)