Breaking News

తగ్గినట్టే తగ్గి.. షాకిస్తున్న పసిడి

Published on Thu, 03/02/2023 - 13:26

సాక్షి,ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు  ఇది చేదు వార్త.  తాజాగా  గురువారం  కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని  అందుకున్నాయి. 

బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే  హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450  పలుకుతోంది.  గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్‌లో  కిలో  వెండి ధర   రూ.70,200కి చేరింది. ఇక ముంబై, కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600(గురువారం)గా ఉంది చెన్నైలో రూ. 52,350, ఢిల్లీ, జైపూర్ , లక్నోలో రూ. 51,750.  మరోవైపు ఢిల్లీ, కోల్‌కతా,  పూణేలో కిలో వెండి ధర రూ.66,800గా ఉంది.

గ్లోబల్‌గా
రాయిటర్స్ ప్రకారం, వడ్డీ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటాయనే పెట్టుబడిదారుల ఆందోళనలను గ్లోబల్ ఎకనామిక్ డేటా  మరింత పెంచింది. డాలర్ పుంజుకోవడంతో  ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి.  బుధవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరిన స్పాట్ బంగారం 0.2శాతం తగ్గి ఔన్సుకు 1,833.57 డాలర్ల వద్ద ఉంది. అమెరికా  గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం  నష్టంతో  1,840.50 డాలర్లుగా  ఉంది.  కాగా బుధవారం వరుసగా మూడవ సెషన్‌లో  లాభంతో గత వారం నుండి బంగారం దాదాపుగా తన నష్టాలనుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)