Breaking News

భారత్‌ తయారీ రంగం డీలా

Published on Fri, 01/03/2025 - 09:29

భారత్‌ తయారీ రంగం(manufacturing sector) డిసెంబర్‌లో డీలా పడింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ డిసెంబర్‌లో 56.4కు పడిపోయింది. గడచిన 12 నెలల్లో ఇంత తక్కువ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. కొత్త బిజినెస్‌ ఆర్డర్లు, ఉత్పత్తిలో మందగమనం(slowdown) కనిపించిందని ఈ మేరకు వెలువడిన సర్వే పేర్కొంది. అయితే సూచీ 50పైన ఉంటే దీన్ని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. అంతకంటే తక్కువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీర్ఘకాలికంగా తయారీ సూచీ 54.1గా ఉండడం గమనార్హం. 2025లో ఉత్పత్తిలో భారీ పెరుగుదల నమోదవుతుందన్న విశ్వాసంలో తయారీదారులు ఉన్నట్లు సర్వే పేర్కొంది.

ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్‌ నోటీసులు

పేఇన్‌స్టాకార్డ్‌ కార్యకలాపాల విస్తరణ

ఫిన్‌టెక్‌ కంపెనీ పేఇన్‌స్టాకార్డ్‌ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాలన్ని ప్రారంభించింది. బ్రాండిక్స్‌ ఇండియా అపారెల్‌ సిటీ (BIAC) ఇండియా పార్ట్‌నర్, పేఇన్‌స్టాకార్డ్‌ ఛైర్మన్‌ పచ్చిపాల దొరస్వామి, వ్యవస్థాపక సీఈవో సాయికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్యను 100కు పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సాయికృష్ణ తెలిపారు. తక్కువ లావాదేవీ వ్యయాలతో బిల్లులు, అద్దెలు, ఫీజులు మొదలైనవి చెల్లించేందుకు అనువైన సాధనంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,00,000 మంది పైగా యూజర్లకు చేరువైనట్లు వివరించారు.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)