Breaking News

ManpowerGroup Employment Outlook Survey: నియామకాలపై భారత్‌లో బుల్లిష్‌ ధోరణి

Published on Thu, 12/14/2023 - 05:44

న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే మూడు నెలల (2024 జనవరి–మార్చి) కాలానికి నియామకాల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌వపర్‌ గ్రూప్‌ ఇండియా సర్వే వెల్లడించింది. నియామకాల ఆశావాదం భారత్‌లోనే ఎక్కువగా నమోదైంది. రానున్న మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని 37 శాతం కంపెనీలు చెప్పాయి.

మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయింట్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే ప్రపంచవ్యాప్తంగా 3,100 కంపెనీలను ప్రశ్నించి ఈ వివరాలను విడుదల చేసింది. 2023 ప్రథమ త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో నియామకాల ధోరణి 5 శాతం ఎక్కువగా కనిపించింది. ‘‘దేశీయ డిమాండ్‌ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. నిరంతరాయ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం భారత్‌ను లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సాయపడుతున్నాయి’’అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ సందీప్‌ గులాటి పేర్కొన్నారు.  

భారత్‌లోనే అధికం..  
జనవరి–మార్చి త్రైమాసికానికి నియామకాల పరంగా ఎక్కువ ఆశావాదం భారత్, నెదర్లాండ్స్‌లోనే కనిపించింది. ఈ రెండు దేశాల్లోనూ 37 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలత కనబరిచాయి. ఆ తర్వాత కోస్టారికా, అమెరికాలో ఇది 35 శాతంగా ఉంది. 34 శాతంతో మెక్సికో నియామకాల ఆశావాదంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా సగటున చూస్తే ఇది రానున్న త్రైమాసికానికి 26 శాతంగా ఉంది.  

ఈ రంగాల్లో సానుకూలం
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నియామకాల సానుకూల త ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఐటీ, కన్జ్యూ మర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగాల్లో నియామకాల ధోరణి వ్యక్తమైంది. మార్చి త్రైమాసికంలో నియామకాలు పెంచుకుంటామని ఫైనాన్షియల్స్, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 45 శాతం కంపెనీలు చెప్పాయి. ఐటీ రంగంలో 44 శాతం, కన్జ్యూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగంలో 42% కంపెనీలు ఇదే విధమైన దృక్పథంతో ఉన్నాయి. అతి తక్కువగా 28% మేర నియామకాల సానుకూలత ఇంధనం, యుటిలిటీ రంగాల్లో కనిపించింది. మన దేశంలో పశ్చిమ భారత్‌లో ఎక్కువగా 39 శాతం మేర నియామకాల పట్ల కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో 38 శాతం సానకూలత కనిపించింది.  

నిపుణుల కొరత
భారత్, జపాన్‌లో నిపుణులైన మానవ వనరుల కొరత అధికంగా ఉంది. భారత్‌లో 81 శాతం సంస్థలు నైపుణ్య మానవ వనరులను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పాయి. 2023 సంవత్సరం ఇదే కాలంలోని ఫలితాలతో పోలి్చచూసినప్పుడు ఒక శాతం పెరిగింది. తమకు కావాల్సిన నిపుణులను గుర్తించడం కష్టంగా ఉందని 85 శాతం జపాన్‌ కంపెనీలు చెప్పాయి. ఆ తర్వాత గ్రీస్, ఇజ్రాయెల్‌లోనూ 82 శాతం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. నిపుణులను గుర్తించి, వారిని నియమించుకుని, అట్టి పెట్టుకునేందుకు కంపెనీలు సౌకర్యవంతమైన పని విధానాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. ఐటీ, డేటా, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్, హెచ్‌ఆర్‌ నిపుణులకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)