Breaking News

ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..

Published on Sun, 10/13/2024 - 18:46

ఒక ఉద్యోగంలో చేరితే.. అప్పటికే ఉన్న ఉద్యోగంలో లభించే జీతం కంటే ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు ఆ జాబ్‌కు రాజీమానా చేస్తారు, లేదా ఆరోగ్య సమస్యల కారణంగా జాబ్‌కు రాజీమానా చేస్తారు. కానీ ఇటీవల ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేసి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రెడిట్‌లో వెల్లడైన ఒక పోస్ట్ ప్రకారం, అసోసియేట్ ప్రొడక్ట్ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరిన మొదటి రోజే.. తన మేనేజర్ ప్రవర్తన నచ్చకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను సైతం రెడిట్‌లో షేర్ చేశారు. తన డ్యూటీ ముగిసిన తరువాత కూడా పనిచేయాలని మేనేజర్ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే ఓవర్ టైం పనికి డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదని మేనేజర్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.

అదనపు వేతనం లేకుండానే రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేయాలని మేనేజర్ చెప్పడంతో ఉద్యోగి తీవ్ర నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగత జీవితానికి విలువ ఇవ్వాలని తాను చెప్పాలనున్నప్పటికీ.. తన మాటలను మేనేజర్ లెక్క చేయలేకపోవడం మాత్రమే కాకుండా.. తనను కించపరిచే విధంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్

ఉద్యోగి పంపిన రాజీనామా లేఖకు, మేనేజర్ ప్రత్యుత్తరం పంపిస్తూ.. తాను ఒకటి చెప్పదలచుకుంటే, మరొక రకంగా అర్థమైనదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగం విషయంలో ఇద్దరి అంచనాలు వేరు వేరుగా ఉన్నతలు వెల్లడించారు.

ప్రస్తుతం ఉద్యోగి చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆఫీసులో పని వాతావరణం నచ్చకుంటే రాజీనామా చేయడం చాలా ఉత్తమం అని కొందరు చెబుతుంటే.. మరికొందరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావని అంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా.. వారు కామెంట్స్ చేస్తున్నారు.

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)