Breaking News

యాపిల్‌ సీఈవో ముందే కొత్త ఐఫోన్‌ పడేసుకున్నాడు..

Published on Sat, 09/20/2025 - 20:19

ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ తెలిసిందే కదా.. తాజాగా విడుదలైన ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్‌లను కొనేందుకైతే యాపిల్‌ స్టోర్ల ముందు కస్టమర్లు క్యూకట్టారు. కొత్త ఫీచర్లతో లాంచ్‌ అయిన బ్రాండ్‌ న్యూ ఐఫోన్‌ను కొనుక్కొని తమ చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని గంటల కొద్దీ కస్టమర్లు క్యూలో వేచిఉన్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి.

అయితే ఓ కస్టమర్‌ తన కొత్త ఐఫోన్ 17ను యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ముందే పడేసుకున్న సంఘటన ఓ యాపిల్‌ స్టోర్‌లో జరిగింది. ముచ్చటపడి కొనుక్కున్న కొత్త ఫోన్‌పై సీఈవో టిమ్‌ కుక్‌తో ఆటోగ్రాఫ్‌ చేయించుకోవాలనుకున్న యువకుడు ఆ ఆత్రుతలో ఇంకా ఓపెన్‌ చేసిన సరికొత్త ఐఫోన్‌ను చేజార్చుకున్నాడు.

తన ముందు కస్టమర్‌ కొత్త ఫోన్‌ పడేసుకున్నప్పుడు టిమ్‌ కుక్‌ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కింద పడిన ఫోన్‌ను తీసుకునేందుకు కస్టమర్‌ కిందికి ఒంగగా ​టిమ్‌ కుక్‌ కూడా అతనికి సాయం చేసుందుకు అన్నట్టుగా కిందికి ఒంగారు. అతను ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాక ఏం కాలేదులే అని అభినందించి ఆ తర్వాత ఆ ఫోన్‌పై తన ఆటోగ్రాఫ్‌ చేశారు.

ఈ సంఘటన ఎక్కడి యాపిల్‌ స్టోర్‌ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ తిరుగుతూ వైరల్‌గా మారింది. ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు యూజర్ల నుంచి విపరీతమైన కామెంట్లు వచ్చాయి.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)