Breaking News

టికెట్‌ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే..

Published on Sat, 03/30/2024 - 09:10

విమాన ప్రయాణం అంటే పకడ్బందీ తనిఖీలుంటాయి. అన్ని ధ్రువపత్రాలు సరిచూసి, స్కాన్‌ చేసి మరీ ప్రయాణికులను విమానంలోకి పంపిస్తారు. అలాంటిది వారి కళ్లుకప్పి టికెట్‌ లేకుండా ఓ వ్యక్తి రహస్యంగా విమానంలోకి ప్రవేశించిన ఘటన అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం..ఇటీవల  టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల విక్లిఫ్ వైవ్స్ ఫ్లూరిజార్డ్ అనే వ్యక్తి పార్క్‌సిటీలోని ఉటాలో జరిగిన స్నోబోర్డింగ్‌ట్రిప్‌ కోసం వచ్చాడు. తాను వచ్చేపుడు తన స్నేహితుడి ‘బడ్డిపాస్‌’ ద్వారా ఉటా చేరుకున్నాడు. తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో తాను వెళ్లాలనుకున్న రెండు విమానాలు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయాయి. దాంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన వేరే విమానంలో ప్రయాణించాలనుకున్నాడు. అయితే తాను అప్పటికీ టికెట్‌ తీసుకోలేదు. విమానం కోసం లాంజ్‌లో వేచిచూస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలు, టికెట్‌ ఫొటోలు వారికి తెలియకుండా దొంగతనంగా తన ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఎలాగోలా ముందే విమానం ఎక్కేశాడు. 

విమానం ఎక్కిన విక్లిఫ్ చివరి లావేటరీకి చేరుకున్నాడు. తాను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. షెడ్యూల్‌ ప్రకారం విమానం బయలుదేరే సమయానికి సిబ్బంది ఇతర ప్రయాణిలను ఎక్కించారు. అప్పటి వరకు చివరి లావేటరీలో ఉన్న విక్లిఫ్ విమానం కదులుతుంటే సిబ్బంది వద్దకు చేరుకుని తన సీటు ఖాళీగా లేదన్నారు. దాంతో సిబ్బంది టికెట్‌ వివరాలు అడగ్గా తన సీటు నంబర్‌ 21 ఎఫ్ అని అటెండర్‌కి చెప్పాడు. అయితే ఆ సీటు కోసం టికెట్ కొన్న వ్యక్తి అప్పటికే అక్కడ కూర్చున్నాడని సిబ్బంది ధ్రువీకరించారు. 

ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్‌ కట్టాల్సిందే..!

విమానం అప్పటికే రన్‌వేపైకి చేరుకుంది. వెంటనే సిబ్బంది గ్రౌండ్‌ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాను రహస్యంగా విమానంలో ప్రవేశించినట్లు తేలడంతో తనను ఫ్లైట్‌ నుంచి దింపేసి పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు తాను ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని ఈ చర్యకు పాల్పడ్డాడని చెప్పారు. కేసు నమోదు చేసి ఉటా కోర్టుకు పంపించారు. ఎయిర్‌పోర్ట్‌లో తాను రహస్యంగా ఇతర ప్రయాణికుల నుంచి దొంగతనంగా ఫొటోలు తీసుకోవడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వివరాలను పోలీసులు కోర్టులో సమర్పించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి విచారణ జరిపి పోలీసులు విక్లిఫ్‌ను సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు.

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)