Breaking News

మార్కెట్‌లోకి మరో కొత్త ఐపీఓ

Published on Sat, 12/14/2024 - 10:03

మమతా మెషినరీ లిమిటెడ్ స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 19 గురువారం రోజున కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. ఈ ఐపీవో ధర కంపెనీ రూ.179 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అందుకు ఒక్కో షేరుకు రూ.230-243 ధర నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 23, 2024న ముగుస్తుంది.

ఈ సంస్థ ప్రధానంగా ప్యాకేజింగ్ యంత్రాల తయారీ, ఎగుమతి, వాటికి సర్వీస్‌ అందిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, పౌచ్‌లు, ఎక్స్‌ట్రూషన్‌ పరికరాలను తయారు చేసే యంత్రాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ), ఫుడ్ & బెవరేజ్ పరిశ్రమలకు సర్వీస్‌ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే యంత్రాలను ‘వెగా’, ‘విన్’ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. 75కి పైగా దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?

ఐపీఓ అలాట్‌ అవ్వాలంటే..

ఒకటికి మించిన పాన్‌ కార్డుల ద్వారా ఐపీఓ దరఖాస్తు చేసుకుంటే షేర్ల అలాట్‌మెంట్‌ అవకాశాలు పెరుగుతాయి. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్‌ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు వేస్తుంటారు. కానీ, ఒకే పాన్‌ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్‌ నంబర్లతో దరఖాస్తులు సమర్పించడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచ్చితంగా మెరుగుపడతాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)