Breaking News

ఖాళీ కుర్చి.. అమెజాన్‌ బెజోస్‌ టెక్నిక్‌ ఇది..!

Published on Sun, 06/16/2024 - 21:48

వ్యాపారంలో విజయవంతమైన ప్రతిఒక్కరికీ ఓ టెక్నిక్‌ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ మరికొంతమంది సక్సెస్‌ సాధిస్తుంటారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్ఫూర్తితో ప్రముఖ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ కోఫౌండర్‌ ఘజల్ అలాఘ్‌ వ్యూహాత్మక సమావేశ టెక్నిక్‌ను పంచుకున్నారు.

తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించిన హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కంపెనీలో ఈ టెక్నిక్‌ నిర్ణయాలను గణనీయంగా ఎలా మెరుగుపరిచిందో ‘ఎక్స్’ పోస్ట్‌లో అలఘ్‌ వివరించారు. "మీరు నిర్వహించే ప్రతి వ్యూహాత్మక సమావేశంలో మీ కస్టమర్లు కూర్చున్నారని ఊహించుకోండి. మా ప్రతి వ్యూహాత్మక సమావేశాలలో ఒక కుర్చీని ఖాళీగా ఉంచుతాం. మా కస్టమర్లే అక్కడ కూర్చున్నారని భావిస్తాం. నేను జెఫ్ బెజోస్ నుంచి ఈ అద్భుతమైన టెక్నిక్ నేర్చుకున్నాను. ఇది హోనాసాలో నిర్ణయాలు తీసుకునే ప్రమాణాలను మెరుగుపరుస్తోంది" అని ఆమె రాసుకొచ్చారు.

"మేము ప్రతి ఆలోచనను కస్టమర్ల దృక్కోణం నుంచి పునఃపరిశీలన చేసుకుంటాం" అని అలఘ్‌ పేర్కొన్నారు. కస్టమర్‌లకు మేలు జరిగేలా ఉంటేనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ అత్యంత వినియోగదారు-స్పృహ కలిగిన కంపెనీలలో ఒకటిగా మారాలనే తమ లక్ష్యాన్ని అలఘ్‌ నొక్కి చెప్పారు.

2008లో ఎన్ఐఐటీలో కార్పొరేట్ ట్రైనీగా ఘజల్ అలఘ్‌ వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. 2016లో ఆమె హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ (మామెర్త్) ను స్థాపించారు. ఇది టాక్సిన్ లేని చర్మ సంరక్షణ, హెయిర్ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులతో తక్కువ సమయంలోనే ఖ్యాతిని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ మోడల్ విజయవంతమైంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు