Breaking News

ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి

Published on Fri, 03/28/2025 - 06:37

ముంబై: ఉద్యోగులు పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకునే విషయంలో సంతృప్తిగా లేనట్టు మానవ వనరుల పరిష్కారాలు అందించే జీనియస్‌కన్సల్టెంట్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. పని వేళలు సౌకర్యంగా లేకపోవడంతో రెండింటిని సమతుల్యం చేసుకోలేకపోతున్నామని 52 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు 36 శాతమే ఉన్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరే ఉద్యోగం–వ్యక్తిగత బాధ్యతల నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 2,763 మంది ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ ఈ నివేదికను విడుదల చేసింది.  

ఉద్యోగుల మనోగతం.. 
→ వ్యక్తిగత బాధ్యతల నిర్వహణకు వీలుగా సౌకర్యవంతమైన పనివేళలు/రిమోట్‌ వర్కింగ్‌కు (ఉన్నచోట నుంచే పనిచేయడం) యాజమాన్యాలు అనుమతించడం లేదని 40 శాతం మంది ఉద్యోగులు తెలిపారు.   
→ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగ బాధ్యతల తాలూకు ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు 79 శాతం మంది చెప్పారు. మెరుగైన విధానాలు, వ్యవస్థల ఏర్పాటు ద్వారా యాజమాన్యాలు పని ప్రదేశాల్లో ఒత్తిడిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. 
→ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో యాజమాన్యాలు తగినంత వెసులుబాటు ఇస్తున్నట్టు 50 శాతం మంది ఉద్యోగులు చెప్పగా.. 10 శాతం మంది ఏదీ చెప్పలేకున్నారు.  → కెరీర్‌లో పురోగతికి వీలుగా తాము పనిచేసే చోట తగిన అవకాశాల్లేవని 47 శాతం ఉద్యోగులు వెల్లడించారు.  
→ తమ మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే మరింత సంతోíÙస్తామని 89 శాతం ఉద్యోగులు చెప్పారు.  
→ ఉద్యోగం కోసం తాము వెచ్చిస్తున్న సమయం, కృషికి తగ్గ వేతనాలను కంపెనీలు చెల్లించడం లేదని 68 శాతం మంది భావిస్తున్నారు. ఇది పనిలో అసంతృప్తికి దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది.  

కంపెనీలు సమీక్షించుకోవాల్సిందే.. 
‘‘ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివేళలు, కెరీర్‌లో పురోగతి, మానసిక ఆరోగ్యపరమైన మద్దతు విషయంలో కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. పని–ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉద్యోగుల శ్రేయస్సుకే కాకుండా, దీర్ఘకాలంలో కంపెనీ వ్యాపార విజయానికి తోడ్పడుతుంది’’అని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ చైర్మన్, ఎండీ ఆర్‌పీ యాదవ్‌ తెలిపారు.   
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)