Breaking News

జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు!

Published on Tue, 02/25/2025 - 14:41

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి వాటిలో ఫీచర్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ 'జీమెయిల్' కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అప్డేట్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? అనే వివరాలు.. ఈ కథనంలో చూసేద్దాం.

ఇప్పటి వరకు జీమెయిల్ లాగిన అయ్యే సమయంలో.. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి గూగుల్ ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్‌లను ఎస్ఎమ్ఎస్ రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబరుకు పంపించేది. కానీ త్వరలో ఈ విధానానికి గూగుల్ స్వస్తి పలకనుంది. దీనికి బదులుగా క్యూఆర్ కోడ్‌ను తీసుకురానుంది. దీనిని వినియోగదారులు వివరాలను మరింత భద్రంగా ఉంచడానికి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మీకు ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎస్ఎమ్ఎస్ ఆధారిత మోసాలు తగ్గుతాయి. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ ఈ నిరన్యం తీసుకుంది.

జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుందని మాత్రం చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బహుశా వీలైనంత త్వరగానే ఈ అప్డేట్ రావొచ్చని సమాచారం.

ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)