Breaking News

గృహోపకరణాలకు డిమాండ్‌ ఆశాజనకం

Published on Tue, 08/13/2024 - 05:54

న్యూఢిల్లీ: పెద్ద గృహోపకరణాల మార్కెట్‌ ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్‌) విలువ పరంగా 18 శాతం వృద్ధిని చూసినట్టు ఎన్‌ఐక్యూ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. గృహాల్లో ముఖ్యమైన ఉత్పత్తులకు డిమాండ్‌ బలంగా ఉన్నట్టు పేర్కొంది. ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్‌వాషర్లు, వాషింగ్‌ మెషిన్లను పెద్ద గృహోపకరణాలుగా(ఎండీఏ) పేర్కొంటారు. 

ఎయిర్‌ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు విలువ పరంగా 30 శాతం వృద్ధి చెందగా, రిఫ్రిజిరేటర్ల విలువ 7 శాతం పెరిగింది. 2023తో పోలి్చతే ఈ వృద్ధి మూడు రెట్లు అధికమని ఎన్‌ఐకే (గతంలో జీఎఫ్‌కే) నివేదిక తెలిపింది. ఇక చిన్న గృహోపకరణాల అమ్మకాల విలువ 29 శాతం వృద్ధి చెందినట్టు వెల్లడించింది. ఇళ్లల్లో సౌకర్యాన్నిచ్చే ఉత్పత్తుల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. 

ఎక్కువ సదుపాయాలతో (ఫీచర్లు) కూడిన ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని, ఇదే గృహోపకరణాల అమ్మకాల విలువలో చక్కని వృద్ధికి సాయపడుతున్నట్టు వివరించింది. 9కిలోలు అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్ల అమ్మకాల విలువ 30 శాతం పెరిగింది. మెరుగైన పనితీరు, వినూత్న ఫీచర్లను కస్టమర్లు చూస్తున్నట్టు తెలిపింది. ఏసీల్లోనూ ఇదే విధమైన ధోరణి ఉందంటూ.. ఇంధనాన్ని ఆదా చేసే 5 స్టార్‌ రేటింగ్, అధిక కూలింగ్‌ సామర్థ్యం కలిగిన ఏసీల విక్రయాలు 59 శాతం (విలువ పరంగా) పెరిగినట్టు ఎన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. సైడ్‌ బై సైడ్, ఫ్రెంచ్‌ డోర్, 3/4 డోర్‌ రిఫ్రిజిరేటర్ల అమ్మకాల విలువ 11 శాతం  పెరిగింది.  

డిమాండ్‌ కొనసాగుతుంది.. 
ఈ తరహా గృహోపకరణాలను ఇప్పటికీ తక్కువ మందే వినియోగిస్తున్నందున.. భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశాలున్నట్టు, ఇది పరిశ్రమ విస్తరణకు అవకాశాలు కలి్పస్తున్నట్టు ఎన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. స్మారŠోట్ఫన్, మొబైల్‌ ఫోన్ల విభాగంలో వృద్ధి పరిమాణం పరంగా 6 శాతం నమోదు కాగా, విలువ పరంగా 12 శాతం వృద్ధి కనిపించింది. కన్జ్యూమర్‌ టెక్, డ్యూరబుల్స్‌ విభాగంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌ అని ఈ నివేదిక తెలిపింది. 2030 నాటికి భారత్‌లోని మధ్యతరగతి వాసులు, ఉన్నత వర్గీయుల కంటే మరింత మొత్తం ఖర్చు చేయనున్నట్టు అంచనా వేసింది.

#

Tags : 1

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)