రేవంత్ తో చంద్రబాబు కుమ్మక్కు.. రాయలసీమ ప్రాజెక్టుపై సజ్జల డిమాండ్స్
Breaking News
మహీంద్రా 'సినీలక్స్' ఎడిషన్: 500 కి.మీ రేంజ్!
Published on Sun, 03/01/2026 - 16:10
మహీంద్రా అండ్ మహీంద్రా.. తన XEV 9e కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో 'సినీలక్స్' పేరుతో లాంచ్ చేసింది. ప్యాక్ త్రీ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైన ఈ మోడల్ ధర రూ. 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మహీంద్రా XEV 9e సినీలక్స్ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు.. రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్‌తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.
సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని సమాచారం.
Tags : 1