Breaking News

మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్: సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా

Published on Thu, 11/14/2024 - 15:43

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.

మహీంద్రా థార్ రోక్స్
భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.

మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్
భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.

రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)