ఐదేళ్లలో 3 లక్షల సేల్స్: మళ్ళీ తగ్గిన ధర

Published on Mon, 09/29/2025 - 20:10

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇండియన్ మార్కెట్లో తన థార్ (Mahindra Thar) ఎస్యూవీ లాంచ్ చేసినప్పటి నుంచి 3 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. దీంతో ఈ ఆఫ్ రోడర్ సరికొత్త అమ్మకాల మైలురాయిని చేరుకుంది.

భారతదేశంలో మహీంద్రా థార్ అక్టోబర్ 2020లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కేవలం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఇందులో థార్ రాక్స్‌ సేల్స్ కూడా ఉన్నాయి. దీనిని (థార్ రాక్స్) కంపెనీ సెప్టెంబర్ 2024లో లాంచ్ చేసింది.

2026 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో జరిగిన మొత్తం థార్ అమ్మకాలలో.. థార్ రాక్స్ 68 శాతం వాటా కలిగి ఉంది. దీన్నిబట్టి చూస్తే.. దేశీయ విఫణిలో థార్ రాక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రూ. 1.35 లక్షలు తగ్గింది. ఇది అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ ధరలు రూ. 10.32 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 16.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. అదే సమయంలో, మహీంద్రా థార్ రాక్స్ ధరలు రూ. 12.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ కార్లు భద్రతలో కూడా మంచి స్కోరింగ్ పొందడంతో.. ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)