Breaking News

సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు: వీడియో

Published on Mon, 03/27/2023 - 20:31

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలలో ఒకటి. ఇప్పటికే థార్, XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి వాటిని విక్రయిస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని రోజులకు ముందు స్కార్పియో-ఎన్‌ SUV సన్‌రూఫ్ లీక్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మహీంద్రా స్కార్పియో సన్‌రూఫ్ లీక్‌ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరుణ్ పన్వార్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఉందంటూ మరో వీడియో పోస్ట్ చేసాడు. దీనికి కారణం కంపెనీ ఎటువంటి చార్జెస్ తీసుకోకుండా సన్‌రూఫ్ బాగుచేసి అతడికి అప్పగించడమే.

గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్‌ నుంచి లోపలికి వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసాడు. అయితే అదే జలపాతం కింద కంపెనీ అలాంటి కారుని నిలిపి ఎటువంటి లీక్ లేదని నిరూపించింది. అంతే కాకుండా కస్టమర్ అసౌకర్యానికి కంపెనీ బాధ్యత వహిస్తూ అతని కారు సన్‌రూఫ్‌ బాగు చేసింది. దీనికి రూ. 53,000 ఖర్చయింది. కానీ కస్టమర్ నుంచి డబ్బు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేసింది. మొత్తానికి యూట్యూబర్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఫీలయ్యాడు.

కంపెనీ అతనికి కారుని అందించిన తరువాత మహీంద్రా స్కార్పియో-ఎన్ జలపాతం కిందికి వెళ్లే సమయంలో సన్‌రూఫ్ కొంత ఓపెన్ అయి ఉండటం వల్ల నీరు లోపలికి వచ్చిందని నివేదించింది. అంతే కాకుండా జలపాతం కిందికి వెళ్లడం ప్రమాదమని, అది కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందని చెప్పుకొచ్చింది. సాధారణంగా కంపెనీ కారులో ఇలాంటి సమస్యలు గతంలో ఎప్పుడూ వెలుగులోకి రాలేదని కూడా వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)