Breaking News

దేశంలో లక్షకుపైగా ఎలక్ట్రిక్‌ ఆటోలు అమ్మిన కంపెనీ

Published on Wed, 04/02/2025 - 14:29

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్ఎంఎంఎల్) ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల (ఈవీ) తయారీదారుగా తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఎల్ 5 కేటగిరీలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రెండు లక్షల కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించినట్లు చెప్పింది. 

ఈ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని 2024 ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం నుంచి 24.2 శాతానికి పెంచినట్లు పేర్కొంది. సుస్థిర మొబిలిటీ, సృజనాత్మక ఉత్పత్తుల తయారీకి కంపెనీ కట్టుబడి ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా లక్షకుపైగా ట్రియో మోడల్‌ ఎలక్ట్రిక్‌ ఆటోలను విక్రయించి ఈ విభాగంలో మొదటిస్థానంలో నిలిచామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?

త్రివీలర్‌ కమర్షియల్‌ వాహనాలకు సంబంధించి ఎల్ 5 కేటగిరీలో ఎంఎల్ఎంఎంఎల్ ముందంజలో ఉందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ట్రియో, జోర్ గ్రాండ్ వంటి ఉత్పత్తులు ఈ వృద్ధికి కీలకంగా నిలిచాయని తెలిపింది. ట్రియో 1,00,000 యూనిట్లకు పైగా విక్రయించడంతో ఈ వాహనాలకు వినియోగదారుల్లో విశ్వసనీయత నెలకొందని చెప్పింది. ఎల్5 ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలో 37.3 శాతం మార్కెట్ వాటాతో ఎంఎల్ఎంఎంఎల్ ఆధిపత్యం వహిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీన్ని కొనసాగించడానికి, వివిధ వ్యాపార అవసరాలను తీర్చడానికి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలైన మెటల్ బాడీ ట్రియో, మహీంద్రా జీఈఓ మోడళ్ల విక్రయాలు ఎంతో తోడ్పడుతున్నాయని పేర్కొన్నాయి.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు