Breaking News

మహీంద్రా  ఈవీల రికార్డు 

Published on Sun, 02/16/2025 - 06:01

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా తయారీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు ఎక్స్‌ఈవీ–9ఈ, బీఈ–6 సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలి రోజు 30,179 యూనిట్ల బుకింగ్స్‌తో ఈవీ రైడ్‌కు సిద్ధం అయ్యాయి. ఎక్స్‌షోరూం ధర వద్ద వీటి విలువ రూ.8,472 కోట్లు. బుకింగ్స్‌లో ఎక్స్‌ఈవీ–9ఈ వాటా 56 శాతం నమోదైంది. ఈ రెండు మోడళ్లలో కలిపి అధిక సామర్థ్యం ఉన్న వేరియంట్స్‌కు వినియోగదార్లు మొగ్గుచూపారు. 79 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ పొందుపరిచిన ప్యాక్‌–3ని 73 శాతం కస్టమర్లు ఎంచుకున్నారు.

 ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మార్కెట్‌ మళ్లుతోందనడానికి ఈ బుకింగ్స్‌ నిదర్శనంగా నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 99,068 యూనిట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్త ఈవీల రికార్డు స్థాయి బుకింగ్స్‌ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్స్‌ఈవీ–9ఈ, బీఈ–6 డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మోడళ్లూ 59 కిలోవాట్‌ అవర్, 79 కిలోవాట్‌ అవర్‌ లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీ ఆప్షన్స్‌తో తయారయ్యాయి. ఒకసారి చార్జ్‌ చేస్తే వేరియంట్‌ను బట్టి 535–682 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)