Breaking News

మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..

Published on Tue, 10/07/2025 - 10:00

దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మహింద్రా తన సూపర్‌ హిట్‌ బొలెరో ఎస్‌యూవీలో కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి ‍ప్రవేశపెట్టింది. బొలెరో B8, బొలెరో నియో N11 అని పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ల ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్‌ షో రూమ్‌) వరకూ ఉండనున్నాయి.

డిజైన్‌ పరంగా చూస్తే కొత్త బొలెరోలో ఆకట్టుకునే హారిజోంటల్ యాక్సెంట్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను సరికొత్తగా సిద్ధం ఏశారు. ఫాగ్‌ల్యాంప్స్‌తోపాటు డైమండ్‌ కట్‌ ఆర్‌-15 అలాయ్‌ వీల్స్‌ను అందిస్తున్నారు. మూడు రంగుల్లో, డ్యుయల్‌టోన్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగు ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్న ఈ వాహనాలల్లో ప్రయాణీకుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు.

సరికొత్త 17.8 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, స్టీరింగ్‌పైనే ఆడియో నియంత్రణకు అవసరమైన బటన్లు ఉన్నాయి. అలాగే వాహనాన్ని నడపడంలో సౌలభ్యం కోసం  రైడ్ &హ్యాండ్లింగ్ టెక్నాలజీ టెక్‌ను వాడారు. ఎలాంటి నేలపైనైనా వెళ్లేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ఈ ఎస్‌యూవీల్లో 55.9 kW శక్తి మరియు 210 Nm టార్క్‌ను అందించే mHAWK75 ఇంజిన్‌ను ఉపయోగించారు. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణ స్వరూపంతో పటిష్టంగా ఉంటుంది. పగుళ్లిచ్చిన రహదారులపై కూడా మెరుగైన ట్రాక్షన్ లభించేలా బొలెరో నియోలో క్రూయిజ్ కంట్రోల్ మరియు మల్టీ-టెరైన్ టెక్నాలజీ (ఎంటీటీ) ఉన్నాయి.

ఇంటీరియర్స్‌ విషయానికి వస్తే లూనార్‌ గ్రే, మోకా బ్రౌన్‌ థీమ్‌ ఆప్షన్లు ఉన్నాయి. లెదరెట్‌ అప్‌హోల్‌స్ట్రీతోపాటు రియర్‌ వ్యూ కెమెరా, 22.8 సెంటీమీటర్ల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటెయిన్‌ మెంట్‌ ఏర్పాట్లు ఉన్నాయి.

కొత్త బొలెరో ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుండగా, కొత్తగా ప్రవేశపెట్టిన టాప్ ఎండ్ B8 వేరియంట్ ధర రూ. 9.69 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంటుంది. కొత్త బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ N11 రేటు రూ. 9.99 లక్షలు.  

మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట మాట్లాడుతూ “పాతికేళ్లుగా భారతదేశపు అత్యంత విశిష్టమైన, పటిష్టమైన ఎస్‌యూవీగా సుస్థిర స్థానం సంపాదించుకున్న బొలెరో నవ భారత యువత ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త శ్రేణి తీర్చిదిద్దింది. దృఢత్వం, సమకాలీన స్టైలింగ్, మరింత సౌకర్యం, ఆధునిక ఫీచర్ల మేళవింపుతో సరికొత్త బొలెరో, బొలెరో నియో, పట్టణ ప్రాంతాల్లోనూ అటు సంక్లిష్టమైన ఎత్తుపల్లాల్లోనూ సమంగా, అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ అనుభూతిని అందిస్తాయి” అని తెలిపారు.

ఇదీ చదవండి: 6జీ అభివృద్ధిలో భారత్‌ పాత్ర కీలకం

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు