ఎస్‌యూవీల రారాజు ఇదే..

Published on Wed, 07/31/2024 - 17:17

దేశంలో ఎస్‌యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్‌ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్‌యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్‌ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్‌ ఎస్‌యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్‌యూవీలు ఉన్నాయి.  ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్‌యూవీ మార్కెట్‌లో మహీంద్రా ఎస్‌యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్‌లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్‌సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్‌ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)