Breaking News

సామర్థ్యం పెంచుకోనున్న మహీంద్రా

Published on Thu, 11/30/2023 - 04:27

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్‌ బుక్‌. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం.

మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్‌యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్‌తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది.  

రెండవ స్థానంలో మహీంద్రా..
ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్‌ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్‌ నమోదు అవుతున్నాయి. నవంబర్‌ 1 నాటికి ఉన్న ఆర్డర్‌ బుక్‌ ప్రకారం ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్‌యూవీ 700 కోసం 70,000, థార్‌ 76,000, బొలెరో 11,000, క్లాసిక్‌ వేరియంట్‌తో కలిపి స్కారి్పయో–ఎన్‌ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్‌ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్‌యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్‌యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)