Breaking News

మహీంద్రా సూపర్‌.. రూ. 2,637 కోట్ల లాభం

Published on Sat, 05/27/2023 - 08:20

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 2,637  కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది.

ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది.

ఇదీ చదవండి: ఎఫ్‌డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)