Breaking News

విదేశాల్లో మేడిన్‌ ఇండియా టూవీలర్ల జోరు

Published on Wed, 08/21/2024 - 11:03

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్‌–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్‌ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 

2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్‌ ఎగుమతుల్లో బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కో, హోండా మోటార్‌సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి. 

అగ్రస్థానంలో బజాజ్‌.. 
ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్‌ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్‌–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్‌ మోటార్‌ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్‌ అండ్‌ స్కూటర్స్‌ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్‌ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్‌ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. 

సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్‌ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్‌ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.   

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)